వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలోకి కాంగ్రెస్‌ యువ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన షర్మిల

5 Aug, 2022 07:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌ నాయక త్వంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కాదని,, ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో చేసిన కల్వకుర్తికి చెందిన యువనేత చీమర్ల అర్జున్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లోటస్‌ పాండ్‌లోని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి చీమర్ల అర్జున్‌ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం అర్జున్‌రెడ్డి  మాట్లాడుతూ.. మొదట పాలేరు.. ఆ తర్వాత కుల్వకుర్తిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అర్జున్‌ రెడ్డి జోస్యం చెప్పారు.
చదవండి: కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్‌.. మునుగోడు కోసమేనా?

మరిన్ని వార్తలు