దీపాలు వెలిగించేందుకు వెళ్లిన కుటుంబం.. టిప్పర్‌ రూపంలో వెంటాడిన మృత్యువు

20 Nov, 2021 10:51 IST|Sakshi

ఆటోను ఢీకొన్న టిప్పర్, ఐదుగురు దుర్మరణం  

మండ్య(బెంగళూరు): కార్తీకపున్నమి రోజున దీపాలు వెలిగించేందుకు ఆలయానికి వెళ్లిన ఒక కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చిన మృతువు   ఐదుగురిని బలిగొంది. మళవళ్లి తాలూకా దడదపురకు చెందిన బండూరు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు ముత్తమ్మ(45), తన కుమార్తె బసమ్మణి(30), కుమారుడు వెంకటేష్‌(25), బసమ్మణి పిల్లలు చాముండేశ్వరి(8), రెండు సంవత్సరాల బాలుడితో కలిసి ఆటోలో అదే తాలూకాలోని మద్దూరులోని ఆలయానికి వెళ్లారు.

ఆలయంలో పూజలు  చేసి తిరిగి వస్తుండగా మళవళ్లి తాలూకా నెలమాకనహళ్లి గేట్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ ఢీకొంది. ఆటో నడుపుతున్న వెంకటేశ్, వెనుక సీట్లలో కూర్చున్న  నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. మళవళ్లి రూరల్‌ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: ప్రేమ పెళ్లి.. ఆపై మరదలి మోజు.. అందుకోసం పక్కాగా ప్లాన్‌ చేసి.. 

మరిన్ని వార్తలు