పానీపూరీ తెచ్చిన రచ్చ! ట్విటర్‌లో వార్‌

3 Apr, 2021 13:49 IST|Sakshi

పానీ పూరీ అంటే తెలియని స్ట్రీట్‌ఫుడ్‌ ప్రియులు ఎవరుండరు. రోడ్డు పక్కన ఉన్న పానీపురీ బండిని చూశామంటే అంతే సంగతులు..! నోట్లో  నీళ్లూరడం ఖాయం. ప్రాంతాన్ని బట్టి పానీపూరీని  వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్‌, గోల్‌ గప్పే, పానీకే పటాషే, ... ఇలా ప్రాంతాలను బట్టి పేరు మారితేనేం? దీని రుచిలో ఉండే మజానే వేరు. కానీ ప్రస్తుతం ఈ పానీపూరీయే ట్విటర్‌లో కొత్త రచ్చకు దారీ తీసింది.  ఈ అంశంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు.

కాగా, ట్విటర్‌లో ఓ నెటిజన్‌ గోల్‌గప్పే, పానీపూరి ఒకటి కాదని చర్చకు తెరలేపింది. ట్విటర్‌లో ఓ ఫొటోనూ షేర్‌ చేసింది. ఈ ఫోటోలో గోల్‌గప్పేకు సూచకంగా అసలైన పానీపూరీ ఫోటో పెట్టగా.. పానీపురీ అంటే గ్లాసులో నీరు ఆ పక్కనే పూరి ఉన్న ఫోటోను ఉంచింది. దీంతో కొంత మంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఆగ్రహానికి గురైయ్యారు. ప్రాంతాలను బట్టి తినే ఆహార పదార్ధాల పేర్లు మారుతుంటాయి. రకరకాల పేర్లతో పిలుచుకుంటాము అందులో తేడా ఏముంది. అందరూ దాన్ని ఇష్టంగానే ఆస్వాదిస్తాం అని ఓ నెటిజన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. తాము పాటిస్తున్న ఆచార వ్యవహారాలే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలైంది.

చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు