IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు..!?

24 Nov, 2023 17:35 IST|Sakshi

ఐపీఎల్‌-2024 మిని వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనున్న ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ప్రాంఛైజీలు దృష్టి సారించాయి. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు నవంబర్‌ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొత్తం 10 ప్రాంఛైజీలు ఆ పనుల్లో బీజీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైలు ట్రేడింగ్‌లో ఆటగాళ్లను మార్చుకున్నాయి కూడా.

చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి జోష్‌ ఇంగ్లీష్‌..
ఐపీఎల్‌-2024 సీజన్‌ నుంచి సీఎస్‌కే స్టార్‌, ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తప్పుకున్నాడు. వర్క్‌లోడ్‌, ఫిట్‌నెస్‌ దృష్ట్యా స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌-2023 మెగా వేలంలో సీఎస్‌కే అతడిని ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా స్టోక్సీ స్ధానాన్ని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లీష్‌తో భర్తీ చేయాలని సీఎస్‌కే మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

త్వరలో జరగనున్న వేలంలో ఇంగ్లీష్‌ను సొంతం చేసుకోవడానికి సీఎస్‌కే ఇప్పటికే వ్యహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇంగ్లీష్‌కు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. అదే విధంగా అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఇంగ్లీష్‌కు ఉంది. ఈ క్రమంలోనే సీఎస్‌కే అతడిపై కన్నేసింది.

గురువారం విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్‌ 110 పరుగులు చేశాడు. బిగ్‌బాష్‌ టీ20లీగ్‌లో కూడా ఇంగ్లీష్‌కు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సీజన్లలోనూ 400కు పైగా పరుగలు చేశాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌కు జోష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: అతడు ప్రత్యేకం.. వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించం‍డి: టీమిండియా మాజీ ఓపెనర్‌

మరిన్ని వార్తలు