-
Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్‌వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్‌తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్‌తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్‌ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్‌కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్‌గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్‌ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్‌కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక విమర్శలు -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
ఐపీఎల్-2024 మిని వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ప్రాంఛైజీలు దృష్టి సారించాయి. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొత్తం 10 ప్రాంఛైజీలు ఆ పనుల్లో బీజీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైలు ట్రేడింగ్‌లో ఆటగాళ్లను మార్చుకున్నాయి కూడా. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి జోష్ ఇంగ్లీష్.. ఐపీఎల్-2024 సీజన్ నుంచి సీఎస్కే స్టార్, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తప్పుకున్నాడు. వర్క్‌లోడ్, ఫిట్నెస్ దృష్ట్యా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2023 మెగా వేలంలో సీఎస్కే అతడిని ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా స్టోక్సీ స్ధానాన్ని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్‌తో భర్తీ చేయాలని సీఎస్కే మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న వేలంలో ఇంగ్లీష్‌ను సొంతం చేసుకోవడానికి సీఎస్కే ఇప్పటికే వ్యహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇంగ్లీష్‌కు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. అదే విధంగా అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఇంగ్లీష్‌కు ఉంది. ఈ క్రమంలోనే సీఎస్కే అతడిపై కన్నేసింది. గురువారం విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ టీ20లీగ్‌లో కూడా ఇంగ్లీష్‌కు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సీజన్లలోనూ 400కు పైగా పరుగలు చేశాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు జోష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: అతడు ప్రత్యేకం.. వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్ -
World Cup 2023: ఆసీస్ బోణీ
లక్నో: ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్ మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా స్పిన్, బ్యాటర్ల సమష్టి బాధ్యత ‘కంగారూ’ జట్టును గెలిపించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78; 12 ఫోర్లు), నిసాంక (67 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జంపా (4/47) తిప్పేయగా, పేసర్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి నెగ్గింది. మిచెల్ మార్‡ ్ష(51బంతుల్లో 52; 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (59 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మదుషంకకు 3 వికెట్లు దక్కాయి. శుభారంభానికి స్పిన్‌తో చెక్ లంక ఓపెనర్లు ఆడిన ఆట, చేసిన పరుగులు, జతకూడిన భాగస్వామ్యం చూస్తే భారీస్కోరు గ్యారంటీ అనిపించింది! దీంతో ఒకదశలో ఆసీస్‌కు మళ్లీ ఓటమి కంగారూ తప్పదేమో అనిపించింది. అంతలా నిసాంక, కుశాల్ పెరీరా ఓపెనింగ్ జోడీ 21 ఓవర్లదాకా అర్ధసెంచరీలతో పరుగుల్ని పోగేసింది. అయితే కమిన్స్ పేస్ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపించింది. దీంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడ్డాక... స్పిన్ వైపు పిచ్ మళ్లింది. ఇదే అదనుగా జంపా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8)లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ అసలంక (25) వికెట్ తీయగా ఆ తర్వాత ఎవరూ పది పరుగులైనా చేయనీకుండా జంపా స్పిన్ ఉచ్చు, స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ లంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. 157 వద్ద రెండో వికెట్ పడిన లంక అనూహ్యంగా 209 పరుగులకే కుప్పకూలింది. కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయింది. తడబడినా... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ మళ్లీ తడబడింది. వార్నర్ (11; 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (0)లను మదుషంక ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో కంగారూ శిబిరం ఆత్మరక్షణలో పడినట్లయింది. అయితే మరో ఓపెనర్ మార్‡్ష, లబుõÙన్ (60 బంతుల్లో 40; 2 ఫోర్లు) కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన మార్‡్ష అర్ధసెంచరీ పూర్తయ్యాక రనౌట్ కాగా... తర్వాత వచి్చన ఇంగ్లిస్, లబుõÙన్ గట్టెక్కించే భాగస్వామ్యం నమోదు చేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతయ్యాక లబుõÙన్ పెవిలియన్ చేరాడు. ఫిఫ్టీ అనంతరం జట్టు విజయానికి చేరువ చేసి ఇంగ్లిస్ నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టొయినిస్ (10 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 61; కుశాల్ పెరీరా (బి) కమిన్స్ 78; మెండిస్ (సి) వార్నర్ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 8; అసలంక (సి) లబుషేన్ (బి) మ్యాక్స్‌వెల్ 25; ధనంజయ (బి) స్టార్క్ 7; వెలలాగె (రనౌట్) 2; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 2; తీక్షణ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; లహిరు (బి) స్టార్క్ 4; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1–125, 2–157, 3–165, 4–166, 5–178, 6–184, 7–196, 8–199, 9–204, 10–209. బౌలింగ్: స్టార్క్ 10–0–43–2, హాజల్‌వుడ్ 7–1–36–0, కమిన్స్ 7–0–32–2, మ్యాక్స్‌వెల్ 9.3–0–36–1, జంపా 8–1–47–4, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్‡్ష (రనౌట్) 52; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 11; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 0; లబుషేన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 40; ఇంగ్లిస్ (సి) తీక్షణ (బి) వెలలాగె 58; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 31; స్టొయినిస్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (35.2 ఓవర్లలో 5 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–24, 2–24, 3–81, 4–158, 5–192. బౌలింగ్: లహిరు 4–0–47–0, మదుషంక 9–2–38–3, తీక్షణ 7–0–49–0, వెలలాగె 9.2–0–53–1, కరుణరత్నే 3–0–15–0, ధనంజయ 3–0–13–0. ఈదురు గాలులతో వర్షం, ఊడిపడిన హోర్డింగ్స్ బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. గాలి బలంగా వీయడంతో స్టేడియంలోని కొన్నిచోట్ల హోర్డింగులన్నీ ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రేక్షకుల హాజరు పలుచగా ఉండటం... ఊడిపడిన చోట జనం లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. చదవండి: SMT 2023: నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం -
ట్రవిస్ హెడ్ విధ్వంసం.. సఫాలను ఊడ్చేసిన కంగారూలు
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 0-3 తేడాతో కోల్పోయింది. డర్బన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 3) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 3-0 తేడాతో ప్రొటీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫెర్రెయిరా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (30 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరంగేట్రం ఆటగాడు డొనొవన్ ఫెర్రెయిరా (21 బంతుల్లో 48; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో ఫెర్రెయిరా.. ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; ఫోర్, 2 సిక్సర్లు)తో పాటు సిక్సర్ల వర్షం కురిపించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్ 2, తన్వీర్ సంగా ఓ వికెట్ దక్కించుకున్నాడు. హెడ్, ఇంగ్లిస్, స్టొయినిస్ల ఊచకోత.. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (22 బంతుల్లో 42; ఫోర్, 4 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. భీకర ఫామ్‌లో ఉండిన కెప్టెన్ మిచెల్ మార్ష్ (15) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తదుపరి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 7, 9, 12, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement