కరోనాపై పోరు: కోహ్లి దంపతులు రూ. 2కోట్ల విరాళం

7 May, 2021 12:19 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారతదేశం అల్లాడిపోతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో బాధితులకు బెడ్లు , ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ కారణంగా చాలా మంది ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇలాంటి విపత్కర ప‌రిస్థితులలో కరోనా బాధితులకు అండ‌గా నిలిచేందుకు సెల‌బ్రిటీలే గాక సామాన్య ప్రజలు సైతం తమకు తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకు వ‌స్తున్నారు. ఈ క్రమంలో విరాట్‌, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఇప్ప‌టికే క‌రోనా బాధితుల స‌హాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తాజాగా అనుష్క‌, విరాట్ కోహ్లీలు త‌మ ట్విటర్ లో ఈ కార్యక్రమంపై వీడియోను కూడా షేర్‌ చేశారు. అందులో కరోనాపై పోరాటానికి తమ వంతుగా విరాళాలు సేక‌రించాల‌ని అనుకుంటున్నాం అని స్ప‌ష్టం చేశారు.

కరోనా కట్టడికి కలిసి పోరాడుదాం
ఈ మహమ్మారిపై దేశం మొత్తం పోరాటం చేస్తోంది. ఈ ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌లు వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందుకే అనుష్క శ‌ర్మ , నేను..  ‘కెటో వెబ్‌సైట్ ద్వారా విరాళాలు సమీకరిస్తున్నాం. కోవిడ్‌పై  వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారు. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. దేశ ప్రజలకు మీ మద్దతు ఇచ్చేందుకు ముందడుగు వేయాలి. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అందరం సహాయ పడుదాం, కలిసి ఈ మహమ్మారిని అంతం చేద్దాం’.. అంటూ విరాట్‌ మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు. విరాళాల రూపంలో సేకరించగా వచ్చిన డబ్బును  మహమ్మారి సమయంలో ఆక్సిజన్, వైద్యపరమైన అంశాలు, టీకా అవగాహన, టెలిమెడిసిన్ సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు.  

( చదవండి: IPL 2021: మంచిగా ఆడుతున్నం అనుకుంటే.. ఇదేందిరా! )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు