Asia Cup 2022 Ind Vs Pak: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్‌ మరీ ఘోరంగా!

24 Aug, 2022 16:51 IST|Sakshi

Asia Cup 2022 India Vs Pakistan:ప్రతిష్టాత్మక ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభమైంది.  అంతకంటే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ యావత్‌ క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌  నేడు(ఆదివారం) జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌-2021లో కనీవినీ ఎరుగని రీతిలో కోహ్లి సేనకు పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.

ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ శర్మ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి పైచేయి సాధించాలని బాబర్‌ ఆజం బృందం ఆశపడుతోంది. మరి ఆసియా కప్‌ టోర్నమెంట్‌ చరిత్రలో భారత్‌- పాకిస్తాన్‌ ముఖాముఖి రికార్డులు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్‌ మరీ ఘోరంగా..
1984 నుంచి ఆసియా కప్‌ నిర్వహణ ఆరంభమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో వన్డే ఫార్మాట్‌లో ఈ ఈవెంట్‌ జరిగింది. భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ పోటీపడ్డాయి. భారత్‌- లంక ఫైనల్‌ చేరాయి. మొత్తంగా రెండు విజయాలతో టీమిండియా విజేతగా నిలిచింది. శ్రీలంక రన్నరప్‌ కాగా.. పాక్‌ రెండు మ్యాచ్‌లు ఓడి భంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగులు, శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

మొత్తంగా ఎన్నిసార్లు తలపడ్డాయంటే..
ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ మొత్తం 14 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో టీమిండియా 8 సార్లు గెలవగా.. పాకిస్తాన్‌ ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

టీ20 ఫార్మాట్‌లోనూ మనదే పైచేయి..
ఆసియా కప్ టోర్నీని 2016లో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అప్పటి నుంచి ఓ దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్‌లో.. ఇలా రొటేషన్‌ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

కాగా టీమిండియా భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వన్డే ఫార్మాట్‌లో 13 మ్యాచ్‌లు జరుగగా.. భారత్‌ ఏడు గెలిచింది. అయితే 1997 నాటి వన్డే మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016లో జరిగిన ఏకైక టీ20లోనూ విజయం భారత్‌నే వరించింది. ఐదు వికెట్ల తేడాతో ధోని సేన.. ఆఫ్రిది బృందాన్ని మట్టికరిపించింది. ఇక ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఐదుసార్లు టైటిల్‌ గెలిచింది. పాకిస్తాన్‌ కేవలం రెండుసార్లు ట్రోఫీ అందుకుంది.

వేదిక స్టేడియం ఫార్మాట్‌ విజేత తేది
దుబాయ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వన్డే తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ విజయం 23 సెప్టెంబరు 2018
దుబాయ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు 19 సెప్టెంబరు 2018
మీర్పుర్‌ షేర్‌-ఇ- బంగ్లా నేషనల్‌ స్టేడియం టీ20 ఐదు వికెట్ల తేడాతో భారత్‌ విజయం 27 ఫిబ్రవరి 2016
మీర్పుర్‌ షేర్‌-ఇ- బంగ్లా నేషనల్‌ స్టేడియం వన్డే ఒక వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం 2 మార్చి 2014
మీర్పుర్‌ షేర్‌-ఇ- బంగ్లా నేషనల్‌ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం 18 మార్చి 2012

డంబుల్లా
రంగిరి ఇంటర్నేషనల్‌ స్టేడియం వన్డే 3 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం 19 జూన్‌ 2010
కరాచి

కరాచి నేషనల్‌ స్టేడియం

వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ గెలుపు 2 జూలై 2008
కరాచి కరాచి నేషనల్‌ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం 26 జూన్‌ 2008
కొలంబో

ఆర్‌. ప్రేమదాస స్టేడియం

 వన్డే

59 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు

25 జూలై 2004
ఢాకా బంగబంధు నేషనల్‌ స్టేడియం వన్డే

44 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం

3 జూన్‌ 2000
కొలంబో

ఎస్‌ఎస్‌సీజీ

వన్డే ఫలితం తేలలేదు 20 జూలై 1997
షార్జా షార్జా క్రికెట్‌ స్టేడియం వన్డే

97 పరుగుల తేడాతో పాక్‌ గెలుపు

7 ఏప్రిల్‌ 1995
ఢాకా బంగబంధు నేషనల్‌ స్టేడియం వన్డే

4 వికెట్ల తేడాతో భారత్‌ విజయం

31 అక్టోబరు 1988
షార్జా షార్జా క్రికెట్‌ స్టేడియం వన్డే

 54 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

13 ఏప్రిల్‌ 1984


చదవండి: Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్‌.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే?
ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్‌ కొట్టేశాడు!

మరిన్ని వార్తలు