Asian Games 2023 Day 4: ప్రపంచ రికార్డుతో సిఫ్ట్‌కౌర్‌ సమ్రా.. ఇషా సింగ్‌కు సిల్వర్‌ మెడల్‌

27 Sep, 2023 17:30 IST|Sakshi
ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచిన సిఫ్ట్‌కౌర్‌ సమ్రా (PC: SAI)

Asian Games 2023 Day 4 Updates
టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ముందడుగు
భారత జోడీ సాహిత్యాన్‌, మనికా బాత్రా థాయ్‌లాండ్‌ ద్వయాన్ని ఓడించి రౌండ్‌ 16కు చేరుకున్నారు.

చరిత్ర సృష్టించిన అనంత్‌జీత్‌
స్కీట్‌ మెన్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు రజత పతకం లభించింది. షూటర్‌ అనంత్‌జీత్‌ సింగ్‌ నరూకా ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత్‌కు ఈ పతకం అందించాడు. అద్భుత ప్రతిభతో సిల్వర్‌ మెడల్‌ సాధించి చరిత్రకెక్కాడు.


 

ఇషా సింగ్‌కు రజతం
తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ 25మీ పిస్టల్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. 18 ఏళ్ల ఇషా ఇప్పటికే 25మీ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌తో కలిపి గోల్డ్‌ మెడల్‌ గెలిచిన విషయం తెలిసిందే.

ఫెన్సింగ్‌లో ముందుకు
ఫెన్సింగ్‌ వుమెన్స్‌ ఎపీ టీమ్‌ విభాగంలో భారత జట్టు క్వార్టర్‌​ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తనిక్షా ఖత్రి, జ్యోతికా దత్త, ఇనా అరోరా జెర్డాన్‌ మహిళా జట్టుపై 45-36తో విజయం సాధించారు. ఇక క్వార్టర్స్‌లో భారత జట్టు సౌత్‌ కొరియాను ఎదుర్కోనుంది.

హాకీలో..
భారత మహిళా జట్టులో హాకీలో విజయంతో గ్రూప్‌ దశను ఆరంభించింది.

సెయిలింగ్‌లో మరో పతకం
ఆసియా క్రీడల్లో సెయిలింగ్‌ విభాగంలో భారత్‌ మరో పతకం సాధించింది. Men's Dnghy ILCA7 ఈవెంట్‌లో విష్ణు శరవణన్‌ కాంస్యం గెలిచాడు. కాగా సెయిలింగ్‌లో భారత్‌కు ఇది మూడో మెడల్‌. 

GOLD WITH A WORLD RECORD- భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌) వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ సిఫ్ట్‌కౌర్‌ సమ్రా గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సమ్రా. తద్వారా భారత పసిడి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చింది.

స్కీట్‌ మెన్స్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టుకు కాంస్యం
భారత పురుష షూటర్ల జట్టు కాంస్య పతకం సాధించింది. గుర్జోత్‌, అనంత్‌జీత్‌, అంగాడ్విర్‌ స్కీట్‌ మెన్స్‌ విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. 

ఆషీ చోక్సీకి కాంస్యం
50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్‌ ఆషీ చోక్సీ కాంస్యం సాధించింది. 

బంగారు తల్లులు.. వారికేమో వెండి పతకం
చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ బుధవారం శుభారంభం చేసింది. షూటింగ్‌ విభాగంలో తొలుత రజతం, తర్వాత ఈవెంట్‌లో స్వర్ణం దక్కింది. 50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌)లో సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీలతో కూడిన మహిళా జట్టు భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ అందించింది.


50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌)లో రజతం

బంగారు తల్లులు వీరే
తదుపరి..  25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌, ఇషా సింగ్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు