Shane Warne: చనిపోయి నాలుగు నెలలు దాటింది..  ఇంకెన్నాళ్లు ఈ కథలు!

17 Aug, 2022 15:34 IST|Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్‌ థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్‌ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్‌లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్‌కు ప్లేబాయ్‌ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్‌లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్‌ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్‌.. వార్న్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్‌ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్‌ ఎఫైర్‌ అని పేర్కొంది.  ''వార్న్‌ థాయిలాండ్‌లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్‌ కాంటాక్ట్‌ ఉండేది. అయితే ఆ ఎఫైర్‌ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్‌గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది.

అలా అతనితో డేటింగ్‌ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్‌ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్‌ తెలిపింది. కాగా గినా స్టివార్ట్‌ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్‌ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్‌ తనను తాను ''వరల్డ్‌ హాటెస్ట్‌ గ్రాండ్‌ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది.

ఇక 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా వార్న్‌ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది.  ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్‌ నా దగ్గర ప్రామిస్‌ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది.

ఇక క్రికెట్‌లో స్పిన్‌ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్‌ వార్న్‌ తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్‌ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.

చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు..

మరిన్ని వార్తలు