షేన్‌వార్న్‌కు ఆసీస్‌ బోర్డు సముచిత గౌరవం

27 Dec, 2022 05:58 IST|Sakshi

దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ను ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌ అవార్డును షేన్‌వార్న్‌ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్‌ వార్న్‌ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్‌ వార్న్‌ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ఆసీస్‌ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్‌ దిగ్గజం వార్న్‌ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు