PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్‌​ ఆడుతున్నావా?

22 Mar, 2022 18:46 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో 196 పరుగుల మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. దాదాపు 603 నిమిషాల పాటు క్రీజులో గడిపిన బాబర్‌ పాకిస్తాన్‌ను ఓటమి నుంచి రక్షించాడు. ఈ టెస్టు మ్యాచ్‌ జరిగి వారం కావొస్తున్నప్పటికీ.. బాబర్‌ ఆజం ఇన్నింగ్స్‌ టెస్టు క్రికెట్‌లో కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఒక మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో బాబర్‌ ఆజం ఏడో స్థానంలో నిలిచాడు.

అయితే పాకిస్తాన్‌ తరపున మాత్రం టెస్టు మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా బాబర్‌ ఆజం నిలిచాడు. అంతకముందు యూనిస్‌ ఖాన్‌ 2015లో శ్రీలంకపై (171 పరుగులు నాటౌట్‌) మెరిశాడు.  బాబర్‌ ఆజం 196 పరుగులు చేయగా.. అంతకముందు వెస్టిండీస్‌ క్రికెటర్‌ జార్జ్‌ హెడ్లీ(ఇంగ్లండ్‌పై 1929లో 223 పరుగులు సాధించి తొలి స్థానంలో  ఉన్నాడు. ఆ తర్వాత సునీల్‌ గావస్కర్‌(1979లో ఇంగ్లండ్‌పై 221 పరుగులు), రెండో స్థానంలో ఉన్నాడు. 

కాగా తన జట్టును కాపాడుకోవడం కోసం మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన బాబర్‌ ఆజంపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. తొలి టెస్టులో నాసిరకం పిచ్‌లు తయారు చేయడంతో.. మ్యాచ్‌ ఫేలవ డ్రాగా ముగిసింది. తాజాగా రెండో టెస్టులోనూ బ్యాటింగ్‌కే పిచ్‌ ఎక్కువగా అనుకూలించింది. అయితే పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో  తక్కువ పరుగులకే కుప్పకూలినప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజం రికార్డు ఇన్నింగ్స్‌తో జట్టును ఓటమి నుంచి కాపాడుకున్నాడు. ''కేవలం రికార్డులు సాధించడం కోసమే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్నావా'' అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు. 

చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ అరుదైన ఫీట్‌.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్దలు

IPL 2022 Opening Ceremony: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా నాలుగో ఏడాది

మరిన్ని వార్తలు