‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’

24 Aug, 2020 10:39 IST|Sakshi

కరాచీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సరిగా ట్రీట్ చేయలేదని పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ఆరోపించాడు. భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో చిరసర్మణీయమైన విజయాలు అందించిన ధోని రిటైర్‌మెంట్ విషయంలో అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బీసీసీఐ ఇవ్వలేకపోయిందని విమర్శించాడు. ధోని రిటైర్‌మెంట్ ఇలా జరగాల్సింది కాదని, టీమిండియా తరఫున ఆడిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందని సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డారు. 

‘ధోని విషయంలో బీసీసీఐ తీరు ఆమోదయోగ్యం కాదు. ఇలా అంటున్నందుకు సారీ. కానీ ధోని రిటైర్మెంట్‌ విధానం చూసి నేను చాలా బాధపడ్డా. భారత జట్టు ప్రస్తుత స్థితికి ధోనినే కారణం. ప్రతీ క్రికెటర్‌ ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదు. అలాగే ధోని నా ఫేవరెట్‌ క్రికెటర్‌, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్‌, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి.  ధోనిని ఇష్టపడే ప్రతీ ఒక్కర్నుంచీ ఒక కంప్లైట్‌ ఉంది. ధోనిని చివరగా టీమిండియా జెర్సీలో చూడాలని అనుకుంటున్నారు’ అని సక్లయిన్‌ పేర్కొన్నాడు. కాగా, కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనికి ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. తన హోమ్‌ గ్రౌండ్‌ చెపాక్‌లో ధోనిని వీడ్కోలు మ్యాచ్‌ ఆడించి అతనికి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ లేకపోయినా ధోనికి వీడ్కోలు మ్యాచ్‌ ఉంటుందనే అంతా అనుకుంటున్నారు. (చదవండి:చైనాకు భారత్‌ షాక్‌ )

మరిన్ని వార్తలు