Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి!

16 Jul, 2022 04:05 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆతిథ్య వేదికలకు భిన్నంగా ఈ సారి బర్మింగ్‌హామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా మెగా ఈవెంట్‌ జరిగితే ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించి అందులో అందరికి వసతి ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో ఒక దేశానికి చెందిన అథ్లెట్ల బృందం ఒకే చోట ఉండటం కుదరదు. కరోనా తదితర కారణాలతో ఆర్గనైజింగ్‌ కమిటీ మొత్తం 5000 పైచిలుకు అథ్లెట్ల కోసం బర్మింగ్‌హామ్‌లో ఐదు క్రీడా గ్రామాల్ని అందుబాటులోకి తెచ్చింది.

16 క్రీడాంశాల్లో పోటీపడే 215 మంది భారత అథ్లెట్లు ఇప్పుడు ఈ ఐదు వేర్వేరు క్రీడా గ్రామాల్లో బసచేయాల్సి ఉంటుంది. కోచ్‌లు, అధికారులు కలుపుకుంటే భారత్‌నుంచి 325 మంది బర్మింగ్‌హామ్‌ ఫ్లయిట్‌ ఎక్కనున్నారు. బస ఏర్పాట్లు, ఇతరత్రా  సదుపాయాల వివరాలను ఆర్గనైజింగ్‌ కమిటీ భారత ఒలింపిక్‌ సంఘాని (ఐఓఏ)కి సమాచార మిచ్చింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగనున్నాయి. 

మరిన్ని వార్తలు