#NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్‌ రికార్డు సమం

12 Jul, 2023 10:32 IST|Sakshi

పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 12వసారి వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు.  ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్‌ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు.

ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్‌ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ​ జొకోవిచ్‌ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు.

జొకోవిచ్‌ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్‌ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి'

Wimbledon 2023: సంచలనం.. నెంబర్‌ వన్‌ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా

మరిన్ని వార్తలు