IND Vs AUS: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్‌ కోహ్లి

17 Oct, 2022 13:28 IST|Sakshi

ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో మెరిశాడు. కోహ్లి కొట్టిన డైరెక్ట్‌ త్రోకు టిమ్‌ డేవిడ్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హర్షల్‌ పటేల్‌ వేసిన రెండో బంతిని జోష్‌ ఇంగ్లిస్‌ ఆన్‌సైడ్‌ దిశగా ఆడాడు. అయితే క్విక్‌ సింగిల్‌ కోసం ఇంగ్లిస్‌ ప్రయత్నించడంతో టిమ్‌ డేవిడ్‌ స్పందించాడు. అయితే ఇక్కడే కోహ్లి తన ఫీల్డింగ్‌ మ్యాజిక్‌ చూపించాడు. బంతిని అందుకున్న కోహ్లి బులెట్‌ వేగంతో త్రో వేయగా.. టిమ్‌ డేవిడ్‌ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డేవిడ్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ తర్వాత కోహ్లి తీసుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌ కూడా చూసి తీరాల్సిందే. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో షమీ వేసిన లో ఫుల్‌టాస్‌ బంతిని లాంగాన్‌ దిశగా ఆడాడు. అది సిక్స్‌ అని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న కోహ్లి అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడు. అయితే తన కాలు బౌండరీ తాకుతుందేమోనన్న అనుమానం కలిగినప్పటికి కోహ్లి జాగ్రత్తపడ్డాడు. దీంతో కమిన్స్‌ ఏడు పరుగుల చేసి పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీంతో బ్యాటింగ్‌లో రాణించనప్పటికి కోహ్లి ప్రదర్శనపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. ''ఫీల్డింగ్‌ కోసమైనా కోహ్లిని తుదిజట్టులో ఉండాల్సిందే.. నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు చేసి చూపెట్టాడు.. దటీజ్‌ కింగ్‌ కోహ్లి'' అంటూ కామెంట్‌ చేశారు.

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఆఖర్లో షమీ మ్యాజిక్‌తో టీమిండియా విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటై ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మహ్మద్‌ షమీ ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 76 పరుగులు చేయగా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 23 పరుగులు చేశాడు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు అర్థశతకాలతో మెరిశారు.

చదవండి: చెలరేగిన సూర్యకుమార్‌.. తగ్గేదే లే

Poll
Loading...
మరిన్ని వార్తలు