FIFA WC 2022: ఖతర్‌లో వరల్డ్‌కప్‌.. కేరళలో తన్నుకున్న అభిమానులు

22 Nov, 2022 14:45 IST|Sakshi

భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెద్దగా అభిమానులు ఉండరు. బెంగాల్‌, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. తాజాగా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రారంభమైన రోజున కేరళలో పెద్ద సందడి నెలకొంది. 

సందడి మాట పక్కనబెడితే కేరళలోని కొల్లాం జిల్లాలోని సక్తిఉలంగర గ్రామంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు తీశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్ అభిమానులుండగా.. కొందరు అర్జెంటీనాకు మద్దతుగా ఉన్నారు. ఈ ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరంటే.. లేదు అర్జెంటీనాదే కప్‌ అని అరుచుకోవడం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. 

ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు,  ఇనుప రాడ్లు అందుకుని  ఇష్టం వచ్చినట్లు  కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉండగా ఫ్యాన్స్ కొట్టుకున్న ఈ ఘటనలో ఒక్కరు కూడా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

చదవండి: గాయాలు కొత్త కాదు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి

మరిన్ని వార్తలు