పృథ్వీ షా ఏందిది?

18 Dec, 2020 13:09 IST|Sakshi

అడిలైడ్‌ : టీమిండియా ఆటగాడు పృథ్వీ షా మరోసారి ట్రోల్స్‌ బారీన పడ్డాడు. అడిలైడ్‌ వేదికగా జరగుతున్న డే నైట్‌ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా డకౌట్‌ అయి విమర్శలు మూట గట్టుకున్నాడు. గిల్‌ స్థానంలో పృథ్వీ ని ఎంపిక చేసిన మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్విటర్‌లో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌  చేశారు. తాజాగా పృథ్వీ షా మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్‌.. వైరలవుతున్న ట్వీట్స్‌)

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 23వ ఓవర్‌లో మార్నస్‌ లబుషేన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా వదిలేశాడు. అయితే అతను వదిలేసిన క్యాచ్‌ అంత కష్టంగా కూడా లేదు. బ్యాటింగ్‌లో డకౌట్‌ అయ్యాడన్న విమర్శలున్న షాను నెటిజన్లు మరోసారి టార్గెట్‌ చేశారు. 'పృథ్వీ షా జట్టుకు భారంగా మారాడు... నీకు బ్యాటింగే రాదనుకున్నాం.. ఇప్పుడు క్యాచ్‌ పట్టడం కూదా రాదని తెలిసిపోయింది... పృథ్వీ షా కెరీర్‌ డేంజర్‌ జోన్‌లో పడింది.. సాహా, పృథ్వీ షాలు జట్టుకు భారం.. భారత్‌ 10 మంది..ఆసీస్‌ 12 మందితో ఆడుతుంది..క్యాచ్‌లు పట్టడం రానివాడు అసలు అంతర్జాతీయ కెరీర్‌లోకి ఎలా వచ్చాడు..'అంటూ చురకలంటించారు. 

ఇక ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ మార్నస్‌ లబుషేన్‌ ఈరోజు నక్కతోకను తొక్కాడు. ఇప్పటికే మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌లో మొదటిసారి 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లబుషేన్‌ ఇచ్చిన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. మళ్లీ 12 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో బుమ్రా లబుషేన్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్‌ కొంత కష్టతరమైనదే. మూడోసారి బుమ్రా బౌలింగ్‌లో 22 పరుగుల వద్ద లబుషేన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఈసారి పృథ్వీ షా జారవిడిచాడు. ఇక ఆసీస్‌ ఇప్పటివరకు 32 ఓవర్లలో 61 పరుగులు చేసింది. లబుషేన్‌ 37 పరుగులు, ట్రేవిస్‌ హెడ్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : ఆమిర్‌కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు)

మరిన్ని వార్తలు