Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌.. సర్వెంట్‌ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ..

10 Mar, 2023 10:46 IST|Sakshi
ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌ శర్మ(PC: Disney+Hotstar/Twitter)

India vs Australia, 4th Test- Rohit Sharma: ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డ్రింక్స్‌బాయ్‌ అవతారమెత్తిన యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొట్టడానికి చేయి ఎత్తినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. కాగా రోహిత్‌ శర్మ సహచర ఆటగాళ్లతో సరదాగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. 

మైదానంలో సారథిగా తన బాధ్యతను చక్కగా నెరవేర్చే ‘హిట్‌మ్యాన్‌’.. కీలక సమయంలో ఆటగాళ్ల తప్పులు చేస్తే మాత్రం అందరిలాగే కోపోద్రిక్తుడవుతాడు. అదే సమయంలో వీలు చిక్కినపుడల్లా జోకులు వేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తాడు. ముఖ్యంగా తనకు సన్నిహితులైన ప్లేయర్ల పట్ల చనువు ప్రదర్శిస్తాడు. అయితే, అది చూసే వాళ్లకు ఒక్కోసారి అతిగా కనిపించే అవకాశం ఉంది. 

కొట్టేస్తాను జాగ్రత్త!
అహ్మదాబాద్‌ టెస్టు మొదటి రోజు ఆట సందర్భంగా డ్రింక్స్‌ అందించేందుకు ఇషాన్‌ గ్రౌండ్‌లోకి వచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ఇషాన్‌కు రోహిత్‌ బాటిల్‌ అందించగా.. అది అతడి చేజారింది. డ్రెస్సింగ్‌రూంకు పరిగెత్తే తొందరలో బాటిల్‌ చేజార్చుకున్న ఇషాన్‌.. కిందకి బెండ్‌ అయి దానిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్‌ను సున్నితంగా మందలించిన రోహిత్‌.. ‘కొట్టేస్తాను జాగ్రత్త’ అన్నట్లు చేయి పైకెత్తాడు. 

సర్వెంట్‌లా కనిపిస్తున్నాడా?
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో కొంతమంది.. ‘‘రోహిత్‌ అసలు ఏమనుకుంటున్నాడు? ఇషాన్‌ కిషన్‌ అతడికి సర్వెంట్‌లా కనిపిస్తున్నాడా? ఇలాంటి ప్రవర్తనకు సిగ్గుపడాలి’’ అని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇషాన్‌కు బాటిల్‌ ఇచ్చి పంపి.. పుజారాకు సందేశం పంపిన రోహిత్‌ పాత వీడియోను ఈ సందర్భంగా షేర్‌ చేస్తున్నారు.

ఇందులో కూడా తప్పులు వెతకాలా?
అయితే, రోహిత్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘వాళ్లిద్దరి మధ్య ఆ చనువు, అనుబంధం ఉంది కాబట్టే రోహిత్‌ అలా ప్రవర్తించాడు. ఇందులో కూడా తప్పులు వెతకాల్సిన పనేముంది. అయినా రోహిత్‌ అంత కాని పని ఏం చేశాడని? ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.


PC: BCCI

కాగా ఐపీఎల్‌లో రోహిత్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో ఆఖరి టెస్టు తొలి రోజు ఆటలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో రోజు ఆట కొనసాగిస్తోంది. ఈ టెస్టుతో అరంగేట్రం చేయాలని ఆశపడ్డ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. శుబ్‌మన్‌ గిల్‌ రోహిత్‌ జోడీగా ఓపెనింగ్‌ చేయనుండగా.. కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: Pat Cummins: పాట్‌ కమిన్స్‌ తల్లి కన్నుమూత
Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌!

మరిన్ని వార్తలు