కామన్‌వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు

5 Oct, 2021 21:24 IST|Sakshi

న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్‌ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్‌వెల్త్ గేమ్స్‌ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్‌వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్‌వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. 
చదవండి: ప్రాంక్‌ చేసి భార్యను బెదరగొట్టిన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ..
 

మరిన్ని వార్తలు