దక్షిణాఫ్రికాతో సిరీస్‌: భారత జట్టు ఇదే

27 Feb, 2021 16:06 IST|Sakshi
భారత మహిళా క్రికెటర్లు(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

దక్షిణాఫ్రికాతో భారత మహిళల వన్డే, టీ20 సిరీస్‌

ముంబై: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా అంతర్జాతీయ స్టేడియంలో భారత- సౌతాఫ్రికా మహిళా జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 8 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 17 వరకు వన్డే సిరీస్‌, మార్చి 20-23 వరకు టీ20 సిరీస్‌ జరుగనుంది. కాగా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

వన్డే సిరీస్‌ జట్టు:
మిథాలీ రాజ్‌(కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగస్‌, పూనం రౌత్‌, ప్రియా పునియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(వైస్‌ కెప్టెన్‌), డి. హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ(వికెట్‌ కీపర్‌), శ్వేత వర్మ(వికెట్‌ కీపర్‌), రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, ఝులన్‌ గోస్వామి, మాన్సి జోషి, పూనం యాదవ్‌, సి. ప్రత్యూష, మోనికా పటేల్‌.

టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), స్మృతి మంధాన(వైస్‌ కెప్టెన్‌), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగస్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, హర్లీన్‌ డియోల్‌, సుష్మా వర్మ(వికెట్‌ కీపర్‌), నుజత్‌ పర్వీన్‌(వికెట్‌ కీపర్‌), ఆయుషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనం యాదవ్‌, మాన్సి జోషి, మోనికా పటేల్‌, సి. ప్రత్యూష, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌.

చదవండికీలకమైన నాల్గో టెస్టు నుంచి వైదొలిగిన బుమ్రా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు