Ben Stokes: ఐపీఎల్‌ ద్వారా కోట్లు అర్జించాడు.. ఇప్పుడేమో అవసరం లేదంట!

8 Feb, 2022 18:50 IST|Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ కంటే టెస్టు క్రికెట్‌ తన నెంబర్‌వన్‌ ప్రాధాన్యత అని కుండబద్దలు కొట్టాడు.డైలీ మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టోక్స్‌ మాట్లాడుతూ..'' ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ నా మొదటి ప్రాధాన్యత. టెస్టు కెప్టెన్‌గా ఉన్న జోరూట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం. అసలే మా టెస్టు క్రికెట్‌ చాలా బ్యాడ్‌గా ఉంది. అందుకే ఈసారి ఐపీఎల్‌లో పేరును కూడా రిజిస్టర్‌ చేసుకోలేదు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్‌లో సుధీర్ఘంగా ఆడాలని కోరుకుంటున్నా. అందుకోసం ఐపీఎల్‌ లాంటి లీగ్స్‌కు దూరంగా ఉంటూ టెస్టు క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తున్నా. ఒకవేళ ఐపీఎల్‌కు పేరు రిజిస్టర్‌ చేసుకొని ఏదో ఒక ఫ్రాంచైజీకి వెళ్లినప్పటికి మనస్పూర్తిగా ఆడకపోయి ఉండొచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Virat Kohli 100th Test: స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసిన బీసీసీఐ

ఇక ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన స్టోక్స్‌ను 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌ రూ.14.5 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మొదటి సీజన్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసిన స్టోక్స్‌ 12 వికెట్లతో పాటు 316 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతని ప్రదర్శనకు మెచ్చిన రాజస్తాన్‌ రాయల్స్‌ వేలంలో రూ.12.5 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. అప్పటినుంచి రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్‌ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. 

కాగా స్టోక్స్‌ వ్యాఖ్యలపై ఐపీఎల్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఐపీఎల్‌లో ఆడి కోట్లు వెనుకేసుకున్నప్పుడు ఈ మాటలు గుర్తుకురాలేదా.. ఇప్పుడు మాత్రం ఐపీఎల్‌ కంటే టెస్టు క్రికెటే ప్రాధాన్యత అని చెప్పడం ఏం బాగాలేదు'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

చదవండి: IPL 2022 Auction:షేక్‌ రషీద్‌ సహా ఏడుగురు అండర్‌-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్‌!

ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్‌ మెగావేలానికి స్టోక్స్‌ తన పేరును రిజిస్టర్‌ చేసుకోలేదు.  కాగా వేలంలో పాల్గొననున్న 590 మంది క్రికెటర్లలో 228 మంది విదేశీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇక ఇంగ్లండ్‌కు యాషెస్‌ సిరీస్‌ పీడకలను మిగిల్చింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన యాషెస్‌ను 4-0తో కోల్పోయిన ఇంగ్లండ్‌కు స్వదేశంలో అవమానాలు ఎదురయ్యాయి. జట్టును మొత్తం సమూలంగా మర్చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో రూట్‌, స్టోక్స్‌ సహా మరికొందరు క్రికెటర్లు టెస్టు క్రికెట్‌ను సవాల్‌గా తీసుకొని రాబోయే సిరీస్‌ల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.
చదవండి: IPL 2022 Auction: మెగావేలానికి నాలుగు రోజులే.. జేసన్‌ రాయ్‌ విధ్వంసం

మరిన్ని వార్తలు