ప్రణయ్‌పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్‌

12 Mar, 2022 05:06 IST|Sakshi

జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువస్టార్‌ లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–15, 21–16తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై గెలిచాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ 10–21, 21–23తో టాప్‌ సీడ్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్‌సన్‌ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–కృష్ణప్రసాద్‌ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్‌–హావో డాంగ్‌ జౌ  (చైనా) జంట చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు