ప్రపంచ ఛాంపియన్లు వీళ్లే.. ఓ క్రీడాంశంలో భారత్‌ కూడా..!

26 Aug, 2023 18:38 IST|Sakshi

వివిధ క్రీడాంశాల్లో (పురుషులు) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లపై (టీమ్‌ గేమ్స్‌) ఓ లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే 17 రకాల క్రీడల్లో 17 దేశాలకు చెందిన జట్లు జగజ్జేతలుగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో భారత్‌ కూడా ఉంది. క్యారమ్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. 

ఈ జాబితాలో యూఎస్‌ఏ అత్యధికంగా మూడు క్రీడాంశాల్లో వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. గోల్ఫ్‌, లాక్రాస్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాంశాల్లో యూఎస్‌ఏ డిఫెండింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. యూఎస్‌ఏ తర్వాత స్పెయిన్‌ అత్యధికంగా రెండు క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. స్పెయిన్‌ బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌లలో వరల్డ్‌ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. పాకిస్తాన్‌ సైతం ఓ క్రీడాంశంలో వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. కబడ్డీలో పాక్‌ జగజ్జేతగా ఉంది. 

వివిధ క్రీడల్లో వరల్డ్‌ ఛాంపియన్లు (పురుషులు)..

  1. క్యారమ్స్‌: భారత్‌
  2. క్రికెట్‌: ఇంగ్లండ్‌
  3. ఫుట్‌బాల్‌: అర్జెంటీనా
  4. గోల్ఫ్‌: యూఎస్‌ఏ
  5. లాక్రాస్‌: యూఎస్‌ఏ
  6. అమెరికన్‌ ఫుట్‌బాల్‌: యూఎస్‌ఏ
  7. టెన్నిస్‌: స్పెయిన్‌
  8. బాస్కెట్‌బాల్‌: స్పెయిన్‌
  9. బ్యాడ్మింటన్‌: డెన్మార్క్‌
  10. కబడ్డీ: పాకిస్తాన్‌
  11. చెస్‌: నార్వే
  12. హాకీ: జర్మనీ
  13. వాలీబాల్‌: బ్రెజిల్‌
  14. బేస్‌బాల్‌: జపాన్‌
  15. రగ్భీ: సౌతాఫ్రికా
  16. సాఫ్ట్‌బాల్‌: ఆస్ట్రేలియా
  17. టేబుల్‌ టెన్నిస్‌: చైనా
మరిన్ని వార్తలు