పాక్‌ పై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది: పూరన్

13 Jun, 2022 17:06 IST|Sakshi

ఆదివారం ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ ఓటమి చెందింది. తద్వారా పాక్‌ చేతిలో 0-3 తేడాతో విండీస్‌ వైట్‌వాష్‌కు గురైంది. కాగా మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన విండీస్‌ కెప్టెన్‌ నికోలస్ పూరన్.. ఈ సిరీస్‌లో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచింది చెప్పాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్ కోసం తాను ఎదురు చూస్తున్నానని పూరన్‌ తెలిపాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో వెస్టిండీస్ తలపడనుంది.

జూన్ 16 (గురువారం) నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. “అఖరి రెండు మ్యాచ్‌లు మాకు నిరాశ కలిగించాయి. తొలి వన్డేలో మేం బాగా రాణించాం. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము పూర్తిగా విఫలమయ్యాం. దీని ఫలితంగా సిరీస్‌కు కోల్పోయాము. ఈ పరాజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. త్వరలో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ఈ సిరీస్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము" అని పూరన్ పేర్కొన్నాడు.

పాకిస్తాన్ వర్సెస్‌ వెస్టిండీస్‌ మూడో వన్డే:
టాస్‌: పాకిస్తాన్‌- తొలుత బ్యాటింగ్‌
పాక్‌ స్కోరు: 269/9 (48)
వెస్టిండీస్‌ స్కోరు: 216 (37.2)
విజేత: డీఎల్‌ఎస్‌ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షాదాబ్‌ ఖాన్‌(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు)
చదవండి: IPL: ఐపీఎల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, జియో! ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే!

మరిన్ని వార్తలు