‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’

4 Sep, 2020 13:11 IST|Sakshi

కరాచీ:  భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఘనతలేమిటో మనకు తెలిసిందే. క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లను సచిన్‌ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌. సచిన్‌ ఆడినన్ని రోజులు ఇది సచిన్‌ శకం అనేంతంగా మరిపించాడు. అయితే సచిన్‌ను మించిన ఆటగాడు ఒకడున్నాడనే విషయాన్ని ఎప్పుడో గుర్తించాడట పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ తన్వీర్‌ అహ్మద్‌. ఈ విషయాన్ని తాజాగా పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ షేర్‌ చేసుకున్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే ఎంఎస్‌ ధోనినే అట. (చదవండి: సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనా ఔట్‌?)

‘ ధోనిలో ఒక ప్రత్యేకమైన ఆటగాడ్ని తమ దేశానికి తన్వీర్‌ ఎప్పుడో గుర్తించాడట. 2004లో కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో ధోనిని తన్వీర్‌ చాలా దగ్గరగా చూసిన విషయాన్ని రషీద్‌తో పంచుకున్నాడట. ‘రషీద్‌ భాయ్‌.. ఒక ప్లేయర్‌ ఉన్నాడు.. అతను సచిన్‌ను మర్చిపోయేలా చేయడం ఖాయమన్నాడు. అప్పుడు నేను దాంతో విభేదించాను. అది జరగదని తేల్చిచెప్పా. సచిన్‌ అంటే సచినే. అతనిలా మరొకరు ఉండరు అని చెప్పాను. మరో సచిన్‌ వచ్చే చాన్స్‌ లేదనే చెప్పా. కానీ సచిన్‌కు చాలా దగ్గరగా వచ్చాడు ధోని. ఒక బ్రాండ్‌ వాల్యూలో సచిన్‌కు అతి దగ్గరగా వచ్చిన క్రికెటర్‌ సచిన్‌’ అని రషీ్‌ లతీఫ్‌ తాజాగా పేర్కొన్నాడు. లతీఫ్‌ తన యూట్యూబ్‌ చానల్‌లో కాట్‌ బిహైండ్‌ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. (చదవండి: కోహ్లి.. చెప్పడానికి ఏమీ లేదు: ఆర్సీబీ)

2004లో అంతర్జాతీ అరంగేట్రం చేసిన ధోని.. ఆ తర్వాత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో 148 పరుగులతో దుమ్మురేపాడు. ఆ మరుసటి ఏడాది జైపూర్‌లో శ్రీలంకపై ధోని విశ్వరూపం ప్రదర్శించి 183 పరుగులు చేశాడు. ఆ సమయంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన సయ్యద్‌ అన్వర్‌(194)కు దగ్గరగా వచ్చిన ధోని దాన్ని మిస్సయ్యాడు. ఇక వికెట్‌ కీపర్‌గా తనదైన మార్కు చూపెట్టిన ధోని.. హెలికాప్టర్‌ షాట్‌ను తీసుకొచ్చాడు. ప‍్రత్యేకంగా సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడైన ధోని.. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టాడు. 2007లో టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011లో వన్డే వరల్డ్‌కప్‌లను ధోని నేతృత్వంలోని భారత్‌ గెలవగా, చాంపియన్‌ ట్రోఫీ కూడా  సాధించిపెట్టాడు. దాంతో మూడు వేర్వేరు ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.(చదవండి: అలా అయితే సచిన్‌ అత్యున్నత శిఖరాలకు చేరేవాడా?)

>
మరిన్ని వార్తలు