పంజాబ్‌లోకి పాక్‌ డ్రోన్‌..ఎందుకొచ్చిందంటే..?

9 Dec, 2023 13:34 IST|Sakshi

ఫిరోజ్‌పూర్‌: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా మబోక్‌ గ్రామంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌‍కూల్చివేసింది.ఈ డ్రోన్‌ చైనాలో తయారైనట్లు బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది.కూల్చివేసిన డ్రోన్‌తో చిన్న పార్సిల్లు రవాణా చేయవచ్చని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

పక్కా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో డ్రోన్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాం. డ్రోన్‌ను గుర్తించిన వెంటనే దానిని కూల్చివేశాం. పంజాబ్‌కు డ్రగ్స్‌ సప్లై చేసేందుకు  డ్రోన్‌ల ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి.

డ్రోన్‌ల ద్వారా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ అనేది పెద్ద సమస్యగా మారింది’ అని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితమే పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌, పంజాబ్‌ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్‌లో కూల్చివేశారు.

ఇదీచదవండి..బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్‌ కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు