BWF World Championship: భారత్‌కు భారీ షాక్‌.. పీవీ సింధు దూరం!

13 Aug, 2022 22:01 IST|Sakshi

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ 2022కు భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. ఒలింపిక్‌ మెడలిస్ట్‌, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చీలమండ గాయం కారణంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ఈ విషయాన్ని సింధూ తండ్రి పివి రమణ దృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ.. "సింధూ కామన్వెల్త్ గేమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో గాయపడింది. ఆమె తీవ్రమైన నొప్పితోనే స్వర్ణం పతకం సాధించింది.

ఈ క్రమంలో సింధూ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. ఆమె గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరిగే పారిస్, డెన్మార్క్ ఓపెన్‌పై సింధు దృష్టంతా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

అయితే ఫైనల్లో గాయంతోనే ఆడినట్లు మ్యాచ్‌ అనంతరం సింధు కూడా వెల్లడించింది. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. కాగా ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధు 5 పతకాలు సొంతం చేసుకుంది. 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు గోల్డ్‌మెడల్‌ కైవసం చేసుకుంది. అదే విధంగా ఆమె ఖాతాలో రెండు సిల్వర్‌ మెడల్స్‌, రెండు కాంస్య పతకాలు  కూడా ఉన్నాయి.
చదవండి: CWG 2022- Narendra Modi: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు