నాదల్‌ 13వసారి సెమీస్‌లోకి...

8 Oct, 2020 05:52 IST|Sakshi

మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)దే పైచేయిగా నిలిచింది. ఇటలీ టీనేజర్‌ జానిక్‌ సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ 7–6 (7/4), 6–4, 6–1తో గెలుపొంది ఈ టోర్నీలో 13వసారి సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 12వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)తో నాదల్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్‌ 9–1తో ఆధిక్యంలో ఉన్నాడు. పారిస్‌ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒకటిన్నరకు ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లోని సెంటర్‌ కోర్టుకు పైకప్పు అమర్చడంతో ఈసారి రాత్రి వేళ కూడా మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7–5, 6–2, 6–3తో 13వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించి తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు