అంత పెద్ద పేరా.. కుదరదు

29 Oct, 2023 04:56 IST|Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్‌ డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌–జేమ్స్‌ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు.

అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్‌ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్‌ మికేలా డెల్‌ శాంటిసిమో సక్రామెంటో డెల్‌ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్‌ వై డీ టొడొస్‌ లాస్‌ సాంటోస్‌’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్‌ చేసేందుకు స్పెయిన్‌ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి  అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు