IPL 2022 Mega Auction: అప్పుడు 1.5 కోట్లు.. ఇప్పుడు అత‌డి కోసం యుద్దం జ‌ర‌గ‌నుంది.. రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే!

9 Feb, 2022 09:25 IST|Sakshi

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌-2022 మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 12,13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా బీసీసీఐ వేలాన్ని నిర్వ‌హించ‌నుంది.  మొత్తం 590 మంది ఆట‌గాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. దీంట్లో 370 మంది భార‌త ఆట‌గాళ్లు, 220 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. కాగా వేలానికి ముందు గరిష్టంగా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవ‌కాశం ఉండండంతో చాలా మంది స్టార్ ఆట‌గాళ్ల‌ని ఫ్రాంఛైజీలు విడిచి పెట్టాల్సి వ‌చ్చింది. 

దీంతో చాలా మంది స్టార్ ఆట‌గాళ్లు వేలంలోకి వచ్చారు. అంతే కాకుండా మ‌రో రెండు కొత్త జ‌ట్లు రావ‌డంతో ఈ ఏడాది వేలానికి మ‌రింత ప్రాధాన్య‌త  సంతరించుకుంది. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే.. ఐపీఎల్‌-2022  మెగా వేలానికి ముందు ఫాఫ్ డు ప్లెసిస్‌ను సీఎస్‌కే రీటైన్ చేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశాడు.

డు ప్లెసిస్‌ను తిరిగి ద‌క్కించుకోవ‌డానికి  చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని  అశ్విన్ అభిప్రాయ‌ప‌డ్డాడు.  కొన్నేళ్లుగా చెన్నై జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా డుప్లెసిస్ ఉన్నాడు. 2021 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ చాంఫియ‌న్స్‌గా నిల‌వ‌డంలో డుప్లెసిస్ కీల‌క పాత్ర పోషించాడు. "గ‌త సీజ‌న్‌లో  డు ప్లెసిస్‌ను 1.5 కోట్లకు సొంతం చెన్నైసూప‌ర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సారి అత‌డి కోసం తీవ్ర‌మైన పోటీ నెల‌కొననుంది.

సీఎస్‌కే ఈ సారి డు ప్లెసిస్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, గత సారి కంటే చాలా ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వేలంలో అత‌డికి మంచి డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. అదే విధంగా క్వింట‌న్ డికాక్‌, డేవిడ్ వార్న‌ర్‌కు  కూడా  వేలంలో భారీ ధ‌ర ద‌క్క‌డం ఖాయం" అని అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో  పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా!

మరిన్ని వార్తలు