IPL 2022 Auction: ముంబై ఇండియన్స్‌ రిటైన్ చేసుకునేది వీళ్లనే..!

25 Nov, 2021 09:52 IST|Sakshi
PC: IPL

Reports:MI retain Rohit Sharma and Jasprit Bumrah: ఐపీఎల్‌-2022 కోసం మెగా వేలం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో ఎవరెవరు  ఏ జట్టు తరపున ఆడతారోనని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా  బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబితాను ఆయా జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను రిటైన్ చేసుకోందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను కూడా రిటైన్‌ చేసుకోవాలని ముంబై భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సూర్యకూమార్‌ యాదవ్‌ లేదా ఇషాన్‌ కిషన్‌ను జట్టులో ముంబై  కొనసాగించే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది సీజన్‌లో  రెండు కొత్త జట్లు చేరనుండటంతో లీగ్‌ మరింత ఉత్కంఠ భరితంగా సాగనుంది

చదవండి: IND Vs NZ 1st Test: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌... ఎట్టకేలకు అయ్యర్‌

మరిన్ని వార్తలు