NZ vs IND: సుందర్‌ను చూసి నేర్చుకో పంత్‌.. ఇంకా జట్టులో అవసరమా? వెంటనే తీసేయండి!

25 Nov, 2022 11:49 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను నిరాశాజనక ఆట తీరుతో మొదలుపెట్టాడు. ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 23 బంతులు ఎదుర్కొన్న పంత్‌ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఫెర్గూసన్‌ వేసిన 33 ఓవర్‌లో తొలి బంతికి ఫోర్‌ బాదిన పంత్‌.. రెండో బంతికి మళ్లీ భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇక వన్డే సిరీస్‌లోనూ అదే ఆటతీరును కనబరిచిన పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి నీవు మారవా పంత్‌ అంటూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్‌బాల్‌ క్రికెట్‌కు పంత్‌ సరిపోడాని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

"ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ చేసి నేర్చుకో పంత్‌' అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా ఈ‍ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ధావన్‌, అయ్యర్‌ అద్భుత ఇన్నింగ్స్‌
ఇక న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(72), శ్రేయస్‌ అయ్యర్‌(80), గిల్‌(50) పరుగులతో రాణించారు. అఖరిలో వాషింగ్టన్‌ సుందర్‌(37) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.   న్యూజిలాండ్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్‌ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్‌ సాధించాడు. 
చదవండి: Ind Vs NZ: శ్రేయస్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. అదరగొట్టిన ధావన్‌, గిల్‌! వాషీ మెరుపులు.. సంజూ ఓకే!

మరిన్ని వార్తలు