WTC Final 2023 Ind Vs Aus: అందుకే అశ్విన్‌ను పక్కనబెట్టాం: రోహిత్‌ శర్మ

7 Jun, 2023 17:36 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తుది జట్టులో స్నిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పిచ్‌ కండీషన్స్‌, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే అశ్విన్‌ను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సమయంలో వివరించాడు. ఇక అశ్విన్‌ స్థానంలో జడేజా ఏకైక స్నిన్నర్‌గా ఉండగా.. షమీ, సిరాజ్‌, ఉమేశ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ రూపంలో నలుగురు పేసర్లు బరిలోకి దిగారు.

అశ్విన్ ను పక్కన పెట్టడాన్ని టాస్ సందర్భంగా నాసిర్ హుస్సేన్ ప్రస్తావించాడు. దీనికి రోహిత్ సమాధానమిస్తూ.. "ఇది ఎప్పుడైనా కఠిన నిర్ణయమే. అతడు చాలా ఏళ్లుగా మా మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. అందుకే అతన్ని పక్కన పెట్టడం అన్నది కఠినమైన నిర్ణయమే. కానీ జట్టు అవసరాలకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందుకే చివరికి ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాం.

నిజానికి టెస్టుల్లో ప్రస్తుతం అశ్విన్ 869 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఇక ఓవల్లో ఉన్న కండిషన్స్ మేఘావృతమై ఉంది. పిచ్ పెద్దగా మారేలా కనిపించడం లేదు. నలుగురు పేసర్ల, ఒక స్పిన్నర్ ను తీసుకున్నాం. జడేజా స్పిన్నర్ గా ఉంటాడు" అని రోహిత్ చెప్పాడు.

చదవండి: సిరాజ్‌ దెబ్బకు అల్లాడిపోయిన లబుషేన్‌


 

మరిన్ని వార్తలు