Sania Mirza Retirement Plans: 'యూఎస్‌ ఓపెన్‌కు దూరం'.. రిటైర్మెంట్‌ ప్లాన్‌లో మార్పులు

23 Aug, 2022 12:42 IST|Sakshi

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయం కారణంగా యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టా‍గ్రామ్‌ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ అనంతరం సానియా తన ప్రొఫెషనల్‌ ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంది. అయితే తాజాగా గాయంతో యూఎస్‌ ఓపెన్‌కు దూరం కావడంతో సానియా రిటైర్మెంట్‌లో పలు మార్పులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్‌మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా' అని ఆమె పేర్కొంది.

మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ అయిన సానియా మీర్జా డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లు ఒక్కోసారి నెగ్గింది. అలాగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌లను కూడా గెలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది.

చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్‌.. నేరుగా మూడో రౌండ్‌కు

Victor Amalraj: పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ బయోగ్రఫీ..

>
మరిన్ని వార్తలు