బిగ్‌బాష్‌ టి20 లీగ్‌లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌..

27 Sep, 2021 10:54 IST|Sakshi

Smriti Mandhana And Deepti Sharma Play In Women's Big Bash League:  మహిళల బిగ్‌బాష్‌ టి20 లీగ్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ డిఫెండింగ్‌ చాంపియన్‌ ‘సిడ్నీ థండర్‌’ తరఫున ఆడతారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్‌ ప్లేయర్లు హీతర్‌ నైట్, టామీ బీమండ్‌ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో స్మృతికి ఇది మూడో జట్టు. గతంలో ఆమె బ్రిస్బేన్‌ హీట్, హోబర్ట్‌ హరికేన్స్‌ జట్ల తరఫున ఆడింది. దీప్తి శర్మ ఈ టోర్నీలోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. 

చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా

మరిన్ని వార్తలు