దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక చిత్తు.. క్లీన్‌స్వీప్‌

6 Jan, 2021 07:57 IST|Sakshi
దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్‌ ఎల్గర్

చివరి టెస్టులో 10 వికెట్లతో శ్రీలంకపై గెలుపు

జొహన్నెస్‌బర్గ్‌: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన చివరిదైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు వికెట్‌ నష్టపోకుండా 13.2 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. ఓపెనర్లు మార్క్‌రమ్‌ (36 నాటౌట్‌; 4 ఫోర్లు), ఎల్గర్‌ (31 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించి లాంఛనం పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఎల్గర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులను అందుకున్నాడు.

కాగా ఈ సిరీస్‌లో ఎల్గర్‌ 253 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 150/4తో మూడో రోజైన మంగళవారం ఆటను ఆరంభించిన శ్రీలంక 56.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 66 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే సెంచరీ (103; 19 ఫోర్లు)తో పోరాడాడు. ఇన్‌గిడి నాలుగు, సిపామ్లా మూడు వికెట్లతో రాణించారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.(చదవండి: ఓపెనర్‌గానే రోహిత్‌ శర్మ!)

మరిన్ని వార్తలు