SL Vs AFG Super-4: టాస్‌ గెలిచిన శ్రీలంక; ప్రతీకారమా.. దాసోహమా!

3 Sep, 2022 19:20 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో లీగ్‌ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. గ్రూపు-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్‌-బి నుంచి అఫ్గానిస్తాన్‌, శ్రీలంక సూపర్‌-4లో అడుగు పెట్టాయి. ఇక ఈ మెగా టోర్నీలో సూపర్‌-4 దశలో శనివారం అఫ్గానిస్తాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ ఎంచుకుంది. లీగ్‌ దశలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలగా ఉంది. అయితే లీగ్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు నమోదు చేసిన అఫ్గాన్‌ సేనను ఏ మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుషాల్‌ మెండిస్‌ సూపర్‌గా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు నజీబుల్లా జద్రాన్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కాగా ప్రస్తుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా ఆఫ్గానిస్తాన్‌ కొనసాగిస్తే.. సూనయసంగా విజయం సాధించడం ఖాయం.

ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిల్లోనూ విఫలమైన లంక, రెండు మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌ పరంగా అదరగొట్టింది. అయితే ఆ జట్టులో అనుభవం ఉన్న బౌలర్‌ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హాసరంగా ఉన్నప్పటికీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు రాణిస్తే ఆఫ్గాన్‌కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌‌), నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, సమీవుల్లా షిన్వారీ, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహక్మాన్, ఫజల్హాల్

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

మరిన్ని వార్తలు