కలకలం: టోక్యో ఒలింపిక్స్‌ విలేజ్‌లో తొలి కరోనా కేసు

17 Jul, 2021 09:55 IST|Sakshi

Tokyo Olympics Village టోక్యో ఒలింపిక్స్‌ విలేజ్‌లో కరోనా కలకలం రేగింది. తొలి కేసును గుర్తించినట్లు టోక్యో 2020 ఒలింపిక్స్‌ నిర్వాహకులు ప్రకటించారు. అయితే అది ఆటగాడికి కాదని, పనుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో ధృవీకరించారు. ప్రైవసీ దృష్ట్యా ఆ వ్యక్తి ఏ దేశస్థుడో చెప్పలేమని, అతన్ని హోటల్‌కు తరలించి ఐసోలేట్‌ చేశామని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌. ఈనెల 13న ఒలింపిక్స్ విలేజ్‌ను తెరిచిన నిర్వాహకులు.. ప్రతిరోజూ క్రీడాకారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి కేసు బయటపడింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో 11వేల మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. 

ఆటగాళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తగా వ్యవహరిస్తామని, కరోనా విజృంభించకుండా అప్రమత్తంగా ఉంటామని ఛీఫ్‌ ఆర్గనైజర్‌ సెయికో హషిమోటో చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు టోక్యోలో విమానం దిగిన ఓ ఉగాండా అథ్లెటిక్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. అతన్ని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా కొంత మంది సిబ్బంది, ఆటగాళ్లు విలేజ్‌కు చేరుకోక ముందే కరోనా బారిన పడ్డారు.

మరిన్ని వార్తలు