Rahul Mankad: మాజీ క్రికెటర్ రాహుల్‌ మన్కడ్‌ కన్నుమూత

31 Mar, 2022 10:07 IST|Sakshi

Rahul Mankad Passed Away: భారత మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆటగాడు  వినూ మన్కడ్  చిన్న కుమారుడు ముంబై మాజీ ఆల్‌రౌండర్‌ రాహుల్ మన్కడ్ (66) అలియాస్‌ జిగ్గా భాయ్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న  రాహుల్.. బుధవారం (మార్చి 30) లండన్‌లోని  ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తండ్రి వారసత్వాన్ని  పుణికి పుచ్చుకుని క్రికెటర్‌గా ఎదిగిన రాహుల్.. 1972-85 మధ్యకాలంలో ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 

జిగ్గా భాయ్‌.. ముంబై తరఫున 47 మ్యాచ్‌లు ఆడి 5 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 2111 పరుగులు, 162 వికెట్లు పడగొట్టాడు. రాహుల్‌ మన్కడ్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. రాహుల్‌ సోదరులు అశోక్ మన్కడ్‌, అతుల్ మన్కడ్‌ కూడా క్రికెటర్లుగా రాణించారు. వీరిలో అశోక్‌ టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. రాహుల్ మృతిపై పలవురు మాజీ క్రికెటర్లు, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. 

కాగా, రాహుల్..  తన తండ్రి వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్' (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ ఔట్ చేయడం) ను నిషేధించాలని జీవితాంతం పోరాడారు.  అయితే ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)  మన్కడింగ్ అనే పదాన్ని నిషేధించి, అలా ఔట్‌ అయిన విధానాన్ని సాధారణ రనౌట్ గానే పరిగణించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధన కార్యరూపం దాల్చకుండానే రాహుల్‌ కన్నుమూయడం బాధాకరం. మన్కడింగ్‌కు సంబంధించి ఎంసీసీ కొత్త రూల్స్‌ ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. 
చదవండి: షేన్‌ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు

మరిన్ని వార్తలు