అనుష్క-కోహ్లి‌ దంపతులకు కుమార్తె..!

11 Jan, 2021 16:29 IST|Sakshi

ముంబై: విరుష్క అభిమానులకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శుభవార్త చెప్పారు. తమకు కుమార్తె పుట్టిందని వెల్లడించారు. ఈ మేరకు కోహ్లి ట్వీట్‌ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లి’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు