పరుగుల వీరుడు విరాట్‌ బర్త్‌డే స్పెషల్‌ స్టోరీ

5 Nov, 2020 11:24 IST|Sakshi

అతడు గ్రౌండ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. బ్యాట్‌ పట్టుకున్నాడంటే బౌలింగ్‌ వేసేది ఎవరైనా గుండెల్లో దడపుట్టాల్సిందే. విసిరిన ప్రతి బాల్‌ బౌండరీ దాటాల్సిందే అతనే టీం ఇండియా సారధి, పరుగుల వీరుడు వీరాట్‌ కోహ్లీ. నేడు తన 32వ యేట అడుగుపెడుతున్నాడు. 1988 నవంబర్‌ 5 వతేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్‌ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా సారధిగా ఎదిగారు. చిన్ననాటి నుంచే క్రికెట్‌ మీద ఎంతో ఆసక్తి ఉన్న కోహ్లీని తన తండ్రి ఎంతో ప్రోత్సహించారు. ఢిల్లీ అకాడమీలో శిక్షణ పొందిన కోహ్లీ  టీం ఇండియా అత్యుత్తమ క్రికెటర్లలలో ముందు వరుసలో ఉంటారు. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్‌ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్‌ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. 2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో వంద పరుగులు సాధించిన తర్వాత, కోహ్లీ టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు.

సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్‌ ద్వారా మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్స్‌లో అడుగుపెట్టాడు. తరువాత ఇక కోహ్లీకి వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తన ప్రతిభ చాటుతూ మహేంద్ర సింగ్‌ ధోని తరువాత భారత క్రికెట్‌ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. 2017లో తాను ప్రేమించిన నటి అనుష్కను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇక ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ 20 లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 7,240 పరుగులు, వన్డేల్లో 11,867 పరుగులు, టీ 20 లలో 2,794 పరుగులు చేసి అత్యుత్తమ క్రికెటర్‌గా నిలుస్తున్నాడు. కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలను చూద్దాం.  

 

చదవండి: విరాట్‌ సైగ, తన భార్యను చూస్తూ..

మరిన్ని వార్తలు