IPL 2022: 'కోహ్లి మళ్లీ కెప్టెన్‌ కాలేడు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు'

7 Mar, 2022 17:09 IST|Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌లో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్‌లు నియమించుకోగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం ఇంకా సారథిని నియమించకోలేదు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్‌లో మళ్లీ తిరిగి కోహ్లి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలపై ఆర్సీబీ మాజీ కెప్టెన్‌, న్యూజిలాండ్ స్పిన్ లెజెండ్ డేనియల్ వెట్టోరి స్పందించాడు. విరాట్ కోహ్లి మళ్లీ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించే అవకాశమే లేదని అతడు తెలిపాడు.

"విరాట్‌ కోహ్లి మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌ అయ్యే అవకాశం లేదు. ఈ విషయం గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క సారి తప్పుకున్నాక మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఆసాధ్యం. ఫ్రాంచైజీ క్రికెట్‌లో లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా జరిగే అవకాశం లేదు. ఆర్సీబీ మెనేజేమెంట్‌ కోహ్లి వరసుడిగా మాక్స్‌వెల్, డు ప్లెసిస్‌, దినేష్ కార్తీక్‌ పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అనుకుంటున్నాను. ఒక వేళ మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే వారు ఖచ్చితంగా డు ప్లెసిస్ వైపే మొగ్గు చూపుతారని నేను భావిస్తున్నాను" అని వెట్టోరి పేర్కొన్నాడు.  కాగా  ఐపీఎల్ 2022 షెఢ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో కేకేఆర్‌ తలపడనుంది. 

చదవండి: IPL 2022: షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేను ఢీకొట్టనున్న కేకేఆర్‌

మరిన్ని వార్తలు