వారియర్స్‌ ఎలెవెన్‌ గెలుపు

24 Oct, 2020 06:00 IST|Sakshi
ఏసీఏ సీఈఓ శివా రెడ్డి నుంచి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారం అందుకుంటున్న శ్రీరామ్‌

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర టి20 క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో చాంపియన్స్‌ ఎలెవన్‌పై వారియర్స్‌ ఎలెవన్‌ ఆరు వికెట్ల తేడాతో... లెజెండ్స్‌ ఎలెవన్‌పై కింగ్స్‌ ఎలెవన్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించాయి. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాంపియన్స్‌ జట్టు తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. అశ్విన్‌ హెబ్బర్‌ (57 నాటౌట్‌), వంశీ కృష్ణ (28), రికీ భుయ్‌ (24) రాణించగా... తేజస్వి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం వారియర్స్‌ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి నెగ్గింది. ఎం.శ్రీరామ్‌ (60 బంతుల్లో 75 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రశాంత్‌ కుమార్‌ (33) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) సీఈఓ ఎం.వి.శివారెడ్డి నుంచి శ్రీరామ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు.  
సంక్షిప్త స్కోరు: కింగ్స్‌ ఎలెవన్‌: 128/8 (20 ఓవర్లలో) (సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ 47, ధీరజ్‌ 28, ఆశిష్‌ రెడ్డి 3/20, జి.మనీశ్‌ 2/22); లెజెండ్స్‌ ఎలెవన్‌: 125 ఆలౌట్‌ (20 ఓవర్లలో) (జోగేశ్‌ 43, కార్తీక్‌ 26, నరేన్‌ రెడ్డి 4/15, ఆశిష్‌ 2/27).

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు