80ల నాటి హెయిర్‌ స్టైల్‌.. ధోని, మలింగలకు 10 పాయింట్లు

19 Jun, 2021 11:17 IST|Sakshi

సౌతాంప్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తొలిరోజు వర్షార్పణమైంది. ఒక్క బంతి కూడా పడకుండానే తొలిరోజు ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక రెండోరోజుకు వరుణుడు ఏ మేరకు సహకరిస్తాడో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే కివీస్‌ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు  80లకాలం నాటి ముల్లెట్‌ హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఐసీసీ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ను అతని హెయిర్‌స్టైల్‌పై ఇంటర్య్వూ నిర్వహించింది.

పాతతరం, కొత్తతరం క్రికెటర్లలో ఆటగాళ్ల హెయిర్‌స్టైల్‌కు సంబంధించి ఎన్ని పాయింట్లు ఇస్తారని అడగ్గా గ్రాండ్‌హోమ్‌ స్పందించాడు. మొదట ఇషాంత్‌ శర్మ హెయిర్‌స్టైల్‌కు 10కి ఆరు పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంఎస్‌ ధోని జులపాల జట్టుకు పదికి పది పాయింట్లు ఇచ్చాడు. ధోని హెయిర్‌స్టైల్‌ తనను ఆకట్టుకుందన్నాడు. అతనిలా తనది ఫర్‌ఫెక్ట్‌ హెయిర్‌స్టల్‌ కాదని.. ఇకపై ఎవరు చేయలేరని పేర్కొన్నాడు. అందుకే ధోని హెయిర్‌ స్టైల్‌కు మొత్తం పాయింట్లు ఇచ్చేశా. ఇక లసిత్‌ మలింగ హెయిర్‌స్టైల్‌ డిఫెరెంట్‌ షేడ్స్‌లో ఉంటుంది.. అతనికి 10 మార్కులు ఇవ్వకుండా ఎలా ఉంటానని తెలిపాడు. ఇక టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా హెయిర్‌స్టైల్‌కు 9 పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా మెక్‌కల్లమ్‌, డానియెల్‌ వెటోరి ఫోటోలు చూపించగా.. వాటికి 8, 9 మార్కులు ఇచ్చాడు.

తన హెయిర్‌స్టైల్‌పై గ్రాండ్‌హోమ్‌ స్పందిస్తూ..' నా హెయిర్‌ స్టైల్‌ నా భార్యకు బాగా నచ్చింది. అది ఎందుకని మాత్రం తను చెప్పలేదు కాని 80ల కాలం నాటి స్టైల్‌ను మళ్లీ చూపించారంటూ మెచ్చకుంది. నా జట్టుపై సహచర ఆటగాళ్లు కామెంట్స్‌ చేసినా నాకు సంతోషమే కలిగింది. అంటూ తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ కివీస్‌ తరపున 25 టెస్టుల్లో 1,194 పరుగులు.. 47 వికెట్లు, 42 వన్డేల్లో 722 పరుగులు.. 27, 36 టీ20ల్లో 487 పరుగులు.. 11 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో జరుగుతున్న టెస్టుచాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో కివీస్‌ తరపున ఆల్‌రౌండర్‌ కోటాలో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
చదవండి: WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు