తాగునీటి పొదుపు అందరి బాధ్యత

23 Mar, 2023 02:16 IST|Sakshi
అమ్మనేరిలో గ్రామసభ నిర్వహిస్తున్న దృశ్యం

పళ్లిపట్టు: తాగునీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ తాగునీటి దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు ఆమోదించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్కేపేట యూనియన్‌లోని 37 గ్రామ పంచాయతీలు, పళ్లిపట్టు యూనియన్‌లోని 33 గ్రామ పంచాయతీలు, తిరుత్తణి యూనియన్‌లోని 27 గ్రామ పంచాయతీల్లో తాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఆర్కేపేట యూనియన్‌లోని అమ్మనేరి పంచాయతీ కొండాపురం దళితవాడలో చేపట్టిన గ్రామసభకు సర్పంచ్‌ గోవిందరెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో గ్రామీణులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తాగునీటి పొదుపు, వర్షపు నీటి వినియోగంపై తీర్మానాన్ని ఆమోదించారు. అయ్యనేరిలో పంచాయతీ సర్పంచ్‌ జయలలిత గ్రామ సభ నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్‌లోని కీచ్చళం పంచాయతీలో సర్పంచ్‌ జాన్‌ గ్రామసభ జరిగింది. నెడిగళ్లులో కుమార్‌, పేటకండ్రిగలో రాజ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు