డిజిటల్‌ పరివర్తనను వేగవంతం చేయాలి

20 Sep, 2022 01:20 IST|Sakshi
 డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సదస్సులో పాల్గొన్న వివిధ రాష్ట్రాలు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు 

హైదరాబాద్‌లో జరిగిన 7వ జాతీయ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సదస్సులో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికత, నూతన ఆవిష్కర ణల ద్వారా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయాలని వక్తలు సూచించారు. సోమవారం హైదరాబాద్‌ కేంద్రంగా 7వ జాతీయ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సదస్సు జరిగింది. రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ, ఐ లాంజ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సంబంధిత రంగ నిపుణులు, స్టార్టప్‌ కంపెనీలు, పలు కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు, విద్యారంగ నిపుణులు పాల్గొ న్నారు.

18కిపైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ దిశగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రతినిధులు చర్చించారు. నాలుగు సెషన్‌లుగా జరిగిన ఈ సదస్సులో సుమారు 50 మందికిపైగా వక్తలు డిజిటల్‌ పరివర్త నను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై పలు సూచనలు చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా అవసరమైన ఫలితాలు సాధించేందుకు వివిధ రాష్ట్రాలు, ఆయా రంగాల నడుమ భాగస్వా మ్యాలు ఏర్పడాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు.

కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వ పని విధానాలు, పౌరసేవలు అందించడంలో సంప్రదా యక పద్ధతుల స్థానంలో సాంకేతికత వినియోగం పెరిగిన తీరుపై చర్చించారు. నో కోడ్, ఏఐ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రభుత్వ విభాగాలు మరిన్ని ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ తరఫున ఐటీ శాఖ అనుబంధ ‘ఎమర్జింగ్‌ టెక్నాలజీ విభాగం’డైరె క్టర్‌ లంక రమాదేవి పాల్గొని డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మే షన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

మరిన్ని వార్తలు