బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అస్వస్థత.. స్పందించిన అధికారులు

4 Aug, 2022 19:04 IST|Sakshi

సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్:  బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఫుడ్‌ పాయిజన్‌ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని,  వాళ్లకు ఎలాంటి ఫుడ్‌ పాయిజన్‌ కాలేదని  ట్రిపుల్‌ ఐటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుస్మిత పేర్కొన్నారు. 

చదవండి: ప్లీజ్‌.. తప్పించండి: బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ!

మరిన్ని వార్తలు