రామ.. రామ! భద్రాద్రి ఈవో అత్యుత్సాహం.. ఆలయానికి ఒకరోజు తాళం

18 Aug, 2022 20:17 IST|Sakshi

సాక్షి, భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో బుధవారం ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. వివరాలివి. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు.

దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపి­వేశారు. అనంతరం యాగశాలలో శఠగోపా­నికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పా­రు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు.
చదవండి: ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి

మరిన్ని వార్తలు