స్టార్‌ హీరోయినే నా డ్రీమ్‌: దేత్తడి హారిక

9 Mar, 2021 07:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్‌ ఆఫర్‌ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఫైనల్‌ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు.

కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్‌ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్‌ వరకు పోరాడారు. టాప్‌ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్‌లు కొట్టేశారు హారిక.

మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్‌ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్‌బాస్‌–4 ఫేమ్‌ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్‌ ఐవీఎఫ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్‌ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్‌ చానెల్‌లో మరో వెబ్‌ సిరీస్‌ రానుందన్నారు.  

ఎప్పటికైనా సినిమాల్లోనే.. 
మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్‌ జామ్‌ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది.  

 

చదవండి:

‘బిగ్‌బాస్‌ 4 రికార్డ్‌ చేసి నా పిల్లలకు చూపిస్తా’

నాగార్జునతో అభిజిత్‌ బిగ్‌ డీల్‌!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు