బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి

13 Aug, 2020 21:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే వివిధ మోర్చాలకు కూడా అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా గీతామూర్తి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కె.శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా డా. ఉమాశంకర్‌ నియమితులయ్యారు.

వీరంతా గురువారమే బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి అమలు చేసిన కార్యక్రమాలను రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్‌ పాషాతో కలిసి బండి సంజయ్‌ విడుదల చేశారు.

మరిన్ని వార్తలు